VZM: బాడంగి మండలంలోని కోడూరు సమీపంలో బుధవారం రాత్రి బొలెరో వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న ఆరు పశువులను పట్టుకున్నట్లు SI స్యూర్యకుమారి తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా పశువులను తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకుని, పశువులను సంరక్షణకు తరలించారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమంగా పశువుల తరలింపు .. పట్టుకున్న పోలీసులు


