CTR: గుడిపాల మండలం తుమ్మలవారిపల్లె–ఇంద్రానగర్ కాలనీ మధ్య రెండు బైకులు ఢీకొన్నాయి. తర్వాత వాళ్లు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో తన మెడలోని బంగారు గొలుసును లాక్కునేందుకు ప్రయత్నించారని విశ్రాంతి ఆర్మీ ఉద్యోగి సదాశివయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై రామ్మోహన్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
గోల్డ్ చైన్ లాగారని ఇద్దరు అరెస్ట్


