హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగార్జునసాగర్‌కు భారీగా వరద

నాగార్జునసాగర్‌కు ఎగువ జూరాల, శ్రీశైలం జలాశయాల నుంచి 44,442 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. బుధవారం సాయంత్రానికి సాగర్ నీటిమట్టం 535.90 అడుగులకు చేరగా, నీటి నిల్వ 179.8926 టీఎంసీలుగా ఉంది. కుడి కాలువకు 6,553, ఎడమ కాలువకు 4,029, ఎస్‌ఎల్‌బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.