హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరుణోదయ కాలనీలో పోలీసుల అవగాహన సదస్సు

ATP: అనంతపురం అరుణోదయ కాలనీలో త్రీటౌన్ పోలీసులు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. సీఐ కౌలుట్లయ్య మాట్లాడుతూ.. మహిళల భద్రత, బాల్యవివాహాల నిర్మూలన, పొక్సో చట్టం, నూతన నేర చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ వివరాలు చెప్పవద్దని సూచించారు. అత్యవసర రక్షణకు శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.