హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు

కడప: కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం PCPNDT అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. స్కానింగ్ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, లింగ నిర్ధారణకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో DRO, DMHO తదితరులు పాల్గొన్నారు.