హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పొన్నూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

GNTR: పొన్నూరు విద్యుత్ ఉపకేంద్రం-1లో ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం పెంపు పనులు చేపడుతున్నారు. దీనివల్ల గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పొన్నూరు పట్టణంలోని పలు ప్రాంతాలతో పాటు మునిపల్లె, జూపూడి, దండమూడి, ఆరెమండ, మన్నవ, ఆల్లూరు తదితర 12 గ్రామాల్లో విద్యుత్ ఉండదన్నారు.