హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరుతడి పంటలకు కాలువల ద్వారా నీరు విడుదల

ATP: మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలతో ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో గుంతకల్లు బ్రాంచి కెనాల్ నుంచి 9 ఉప కాలువలకు నీటిని విడుదల చేశారు. కరకముక్కల వద్ద 4వ ఉప కాలువకు ఏఈఈ షర్పుద్దీన్, నాయకులు నీటిని వదిలారు. ఈ కెనాల్ ద్వారా దాదాపు 15,800 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని అధికారులు తెలిపారు.