హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు ఆటంకం

AKP: పరవాడ మండలంలో పలు గ్రామాలకు గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ మురళీకృష్ణ తెలిపారు. సబ్ స్టేషన్‌లో నిర్వహణ పనులు చేపడుతున్న కారణంగా భరిణికం, గొర్లివానిపాలెం ఈ. బోనంగి, బొద్దపువానిపాలెం, కలపాక, పి.బోనంగి, స్వయంభూవరం గ్రామాలకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.