హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైండోవర్ ఉల్లంఘిస్తే జైలు: పోలీసులు

సత్యసాయి: రోళ్ల మండలంలో బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. కల్లురొప్పం గొల్లహట్టి గ్రామానికి చెందిన వ్యక్తికి 15 రోజుల రిమాండ్ విధించి జైలుకు తరలించారు. బైండోవర్ చేసిన వారు ఏడాది పాటు గొడవలు, నేరాలకు దూరంగా ఉండాలని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 లక్షల వరకు జరిమానా లేదా జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు.