KDP: చిన్నపసుపుల గ్రామంలో పెద్దముడియం పోలీసులు బుధవారం రాత్రి గ్రామసభ నిర్వహించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని జమ్మలమడుగు రూరల్ సీఐ కులయప్ప సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సుబ్బారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నపసుపులలో పోలీసుల గ్రామసభ


