హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గండిక్షేత్రంలో చివరి శనివారానికి భారీ ఏర్పాట్లు

అన్నమయ్య: గండి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ విశ్వనాథ్‌ తెలిపారు. ఈ ఏడాది నాలుగు శనివారాలు రావడంతో ఈ నెల 5న చివరి శనివారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. ఆలయ ఛైర్మన్‌ వెంకటస్వామి పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.