హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

SRCL: ఈ నెల 12న నిర్వహించే లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకుని పెండింగ్‌లో ఉన్న కేసులనుపరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్‌ఎస్‌ఏ అధ్యక్షురాలు పి.నీరజ సూచించారు. జిల్లా కోర్టు సముదాయంలో న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రాజీపడే మార్గమే అన్నిటికన్న ఉత్తమమైన మార్గమని అన్నారు.