హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కట్టెలకు అడవికి వెళ్లి శవమయ్యాడు!

నెల్లూరు: ఆత్మకూరు మండలం నబ్బీనగరానికి చెందిన చీర్ల పాపయ్య బుధవారం (55) అడవిలో చనిపోయాడు. సెప్టెంబర్ 1న కట్టెల కోసం అడవికి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. నబ్బీనగరం-వింజమూరు మార్గంలోని కల్వర్టు కింద ఆయన మృతదేహం లభ్యమైంది. సీఐ గంగాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.