VSP: శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 4న (శుక్రవారం) జీవీఎంసీ పరిధిలో మాంసం, చేపల విక్రయాలు, జంతు వధశాలల నిర్వహణపై పూర్తి నిషేధం విధిస్తూ కమిషనర్ కేతన్ గార్గ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పండుగ పవిత్రత దృష్ట్యా వ్యాపారులు తప్పనిసరిగా దుకాణాలు మూసివేయాలన్నారు. ఆదేశాలు బేఖాతరు చేసి విక్రయాలు చేపడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు మాంసం దుకాణాలు బంద్


