హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరుపేదల ఆరాధ్య దైవం వైఎస్సార్

అన్నమయ్య: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిరుపేదల ఆరాధ్య దైవమని కాంగ్రెస్ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కే. బాషా అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రజలకు మేలు చేశారని కొనియాడారు. వైఎస్సార్ ఆశయ సాధనకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.