హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆధార్ లేని పిల్లల సర్వేపై సమీక్ష

KDP: బద్వేల్ పురపాలక కార్యాలయంలో చిల్డ్రన్ వితౌట్ ఆధార్ సర్వేపై మున్సిపల్ కమిషనర్ యం. కృష్ణ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్వే పురోగతిని పరిశీలించి, ఆధార్ లేని పిల్లల వివరాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్ వివరాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్, వార్డు సెక్రటరీలు పాల్గొన్నారు.