హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డెంటల్ క్లినిక్‌ను ప్రారంభించిన కలెక్టర్

కడప నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'నవీ డెంటల్ కేర్' క్లినిక్‌ను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి క్లినిక్‌ను ప్రారంభించిన కలెక్టర్, దంత వైద్యులు డా. మేరువ వెంకట నవీన్‌ను అభినందించారు. ఆధునిక సాంకేతికతతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.