ప్రకాశం: టంగుటూరులోని జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ మరో ఇద్దరిని హైవే అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
లారీని వెనక నుంచి ఢీకొట్టిన కారు


