PPM: వార్షిక తనిఖీల్లో బాగంగా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ వెంకటరావు ఎస్పీకి పూలమొక్కను అందజేసి సాదరస్వాగతం పలికారు. కంప్యూటర్ గదిని, ప్రాపర్టీ గదిని తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టేషన్ ప్రాంగణంలో ఉన్న వాహనాలపై ఆరా తీశారు. పిర్యాదుదారుల పట్ల మర్యాదగా మెలగాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ


