హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

VZM: ముంజేరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ముంజేరు జనసేన క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాసేవ, నిజాయితీ, సిద్ధాంతాలే పవన్ కళ్యాణ్ బలమన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.