కృష్ణా: తాడిగడప మహానాడు 100 అడుగుల రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న 77 మంది రైతులకు పూర్తి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన రైతులతో సమావేశమయ్యారు. 1:4 నిష్పత్తిలో టీడీఆర్ బాండ్లు మంజూరు చేయించి, నాలుగు నెలల్లో అందిస్తామన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే పనులు వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే


