హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘స్వర్ణాంధ్ర @ 2047’ శిక్షణా తరగతులు ప్రారంభం

SS: పుట్టపర్తి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్‌లో 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ కార్యాచరణలో భాగంగా జిల్లా, మండల స్థాయి అధికారులకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. స్థూల ఉత్పత్తి గణన, అంచనాల తయారీపై అవగాహన కల్పించేందుకు 15 రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనుంది. ఆర్థిక ప్రగతికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడంలో ఈ శిక్షణ కీలకమని సీపీఓ విజయకుమార్ తెలిపారు.