హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అయ్యప్ప ఆలయ అభివృద్ధికి విరాళం

కృష్ణా: బాపులపాడులోని అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి ఎస్‌ఆర్‌ లయన్స్‌ నాయకుడు మేడికొండ బుచ్చి బాపయ్య రూ. 50 వేల విరాళం అందించారు. బుధవారం ఈ మేరకు ఆలయంలో అధికారులకు అందజేశారు. భక్తుల సౌకర్యాల కోసం ఈ విరాళాన్ని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ కమిటీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది.