హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని బండారులంకలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. నిపుణులైన వైద్యులు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే పవన్ ఆశయాలకు నిజమైన నివాళి అని ఎమ్మెల్యే అన్నారు.