హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాలా బకాయిల వసూళ్లపై కలెక్టర్ ఆదేశం

కోనసీమ: వ్యవసాయేతర భూమి నాలా రుసుముల బకాయిల వసూళ్లపై అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు. నాలా అనుమతులు పొంది రుసుములు చెల్లించని, పాక్షికంగా చెల్లించిన కేసులను గుర్తించి నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. బకాయిదారులకు నోటీసులు జారీ చేసి గడువులోగా వసూళ్లు పూర్తి చేయాలన్నారు.