హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO:'బెల్ట్ షాపులు తొలగించాలీ'

NLR: వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీ తక్కెళ్లపాడులో బెల్ట్ షాపులు తొలగించాలంటూ మహిళలు బుధవారం ఆందోళన చేపట్టారు. గ్రామంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాఠశాల సమీపంలోనే మద్యం విక్రయాలు సాగుతున్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.