హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు మక్తాపురంలో కలెక్టర్‌ పల్లె వీక్షణ'

NLR: సంగం మండలం మక్తాపురం గ్రామంలో గురువారం కలెక్టర్‌ ఆధ్వర్యంలో పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ షాలెట్ తెలిపారు. అనంతరం పి.జి.ఆర్.ఎస్. కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. మండల ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.