హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు

W.G: అత్తిలి బస్టాండు ప్రాంగణంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్రగాయాలయ్యాయి. భీమవరం నుంచి తణుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు బస్టాండ్ నుంచి బయటకు వెళుతున్న సమయంలో తణుకు మండలం పైడిపర్రుకు చెందిన అనపర్తి కాంతమ్మను ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాంతమ్మ కాళ్లు నుజ్జు కావడంతో చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.