హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పాఠశాల స్థలం కాపాడాలి'

ASR: అరకు నేరేడువలస సమీపంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల స్థలాన్ని కాపాడాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సూర్యనారాయణ, సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. సర్వే నంబర్‌ 54-3లో పాఠశాలకు కేటాయించిన 1.16 ఎకరాల స్థలాన్ని కొందరు ఆక్రమించి షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తున్నారని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు.