హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ కుమ్మరి చెరువు వద్ద జనసేన నేత వేమూరి త్రినాథ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే రాము పాల్గొని, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ పదవుల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.