హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేత్రదానంపై అవగాహన ర్యాలీ

ASR: జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా డుంబ్రిగుడ మండలంలోని కిల్లోగూడులో బుధవారం నేత్రదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డా. కుమార్‌రత్న మాట్లాడుతూ.. మరణించిన వ్యక్తి నుంచి ఆరు గంటల్లోపు నేత్రాలను సేకరించి, కార్నియా అంధత్వంతో బాధపడుతున్న ఇద్దరికి అమర్చవచ్చన్నారు. నేత్రదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.