NTR: జగ్గయ్యపేట పట్టణంలోని తపోవన్ స్కూల్ సమీపంలో వర్షపు నీటి సమస్య ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. కొద్దిపాటి వర్షం కురిసినా రోడ్డుపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లోనే డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి'


