హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైఎస్‌ఆర్‌ ఆశయాలను కొనసాగిస్తాం: వైసీపీ

ATP: వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం వైసీపీ నిరంతరం కృషి చేస్తోందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. వైఎస్‌ఆర్‌ 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయం, జడ్పీ ఆవరణలోని వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు వైసీపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.