ELR: సీతారాంపురంలో మంచినీటి చెరువు, OHSR ట్యాంక్‌ను బుధవారం ప్రత్యేక అధికారి రమేష్ బాబు పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని, చెరువు పరిశుభ్రత, ట్యాంక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి జీ. బ్రహ్మానందం పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మంచినీటి చెరువు, OHSR ట్యాంక్ పరిశీలన


