ASR: డుంబ్రిగూడ మండలం పోతంగి సచివాలయాన్ని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 11 గంటలైనా సిబ్బంది ఒక్కరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి వెళ్లినట్లు గుర్తించారు. ప్రజలు వచ్చినప్పుడు కనీసం ఒక్కరైనా ఉండాలని, ప్రజా సేవలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
సచివాలయం ఖాళీ.. ఎమ్మెల్యే ఫైర్


