హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వయోజన విద్యపై అవగాహన

ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం అంతర్జాతీయ అక్షరాస్యత పక్షోత్సవాలలో విద్యార్థులకు "వయోజన సాహిత్యాన్ని రూపొందించడంలో నా పాత్ర" అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా కేశవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జిల్లా నోడల్ ఆఫీసర్ కె. గంగన్నదొర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువత గ్రామాల్లో వయోజన విద్యపై అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.