హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ధరలను నియంత్రించాలి'

AKP: పరవాడ సినిమా హాల్‌ జంక్షన్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై నిరసన చేపట్టారు. సీఐటీయూ నాయకుడు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. పంచదార, పప్పులు, నూనె, కూరగాయల ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ధరలను అదుపు చేయాలని అనకాపల్లి జిల్లాను కరువు జిల్లా ప్రకటించాలని కోరారు.