హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VZM: అనకాపల్లి పట్టణంలోని నూకాంబిక అమ్మవారిని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యేకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.