VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో వరాహ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి శ్రీకారం చుట్టారు. జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ ప్రక్రియలను కమనీయంగా నిర్వహించారు. భక్తులకు వేద ఆశీర్వచనం అందజేసి అంతరాలయ దర్శనం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
సింహాచలంలో వైభవంగా నిత్య కళ్యాణం


