హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక మండపానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

ATP: అనంతపురం నగరంలోని 4వ రోడ్డు శాంతినగర్ సర్కిల్‌ వద్ద వినాయక మండపానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమిపూజ చేశారు. ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, వడ్డెర కుల సంఘాల నాయకులతో కలసి ఆయన పూజల్లో పాల్గొన్నారు. 25 ఏళ్లుగా వడ్డెర సోదరులు ఐకమత్యంతో వినాయక ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు.