హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుటుంబాలకు కారుణ్య నియామక ఉత్తర్వులు

ELR: విధి నిర్వహణలో మరణించిన, అనారోగ్యం, ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన హోంగార్డుల కుటుంబంలో అర్హులైన సభ్యులకు కారుణ్య నియామక ఉత్తర్వులను ఎస్పీ ప్రతాప్ కిషోర్ అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు ఈ ఉద్యోగాలు ఎంతో భరోసానిస్తాయన్నారు. కష్టకాలంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు.