హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో భానుడి భగభగలు

VZM: సెప్టెంబరులో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే విజయనగరంలో అత్యధికంగా 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. వర్షాకాలంలోనూ వేసవిని తలపించేలా ఎండలు దంచికొడుతుండటంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులు ఇలాగే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.