హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత వైద్య శిబిరం

SKLM: సోంపేట మండలం బేసిరామచంద్రపురంలో బుధవారం 104 సిబ్బంది ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. కొర్లం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ రోషిణి హాజరై రోగులకు వైద్య సేవలు అందించారు. 80 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తే రోగాలకు దూరంగా ఉండవచ్చని సూచించారు.