హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మంత్రికి బీజేపీ కీలక బాధ్యతలు'

SS: మంత్రి సత్యకుమార్‌కు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహించనున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమానికి దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను ఆయనకు కేటాయించారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో జరిగిన దేశాభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఆయన పనిచేయనున్నారు.