SKLM: ఎచ్చెర్ల మండలంలోని కొత్తపేట గ్రామంలోని కాలువలో పూడికతీత పనులను రైతులు బుధవారం స్వచ్ఛందంగా చేపట్టారు. ఈ కాలువ నుంచి సుమారు 10 గ్రామాల రైతులు పంటలు సాగు చేసేందుకు నీరు అందుతుంది. అయితే కాలువలో పూడిక పేరుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో రైతులే స్వయంగా ముందుకు వచ్చి పూడికతీత పనులు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రైతుల స్వచ్ఛంద పూడికతీత


