KDP: బద్వేలులో పెరుగుతున్న ఆహార ధాన్యాలు, కూరగాయలు, పప్పులు, నూనెల ధరలను తక్షణమే నియంత్రించాలని ఐద్వా బద్వేలు పట్టణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం పెరుగుతోందని పట్టణ అధ్యక్షురాలు పశువుల మోక్షమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'నిత్యావసర ధరలు తగ్గించాలి'


