KRNL: మేళగనూరు సమీపంలోని తుంగభద్ర నదిలో తిరుగుతున్న మొసలిని రైతులు బంధించారు. వారం రోజుల క్రితం నదిలో మొసలి కనిపించడంతో భయాందోళనకు గురైన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు స్పందించకపోవడంతో రైతులే మొసలిని బంధించి నది ఒడ్డుకు తీసుకువచ్చారు. దీన్ని బట్టి అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
మొసలిని బంధించిన రైతులు


