ASR: జిల్లాలోని కొయ్యూరు (M)మర్రిపాకలలో సరైన రహదారి సౌకర్యం లేక ఒక గిరిజన మహిళ ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర అనారోగ్యానికి గురైన కొర్రాబు పద్మను కుటుంబ సభ్యులు 11 కిలోమీటర్ల మేర డోలీలో మోసుకెళ్లి ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు పేర్కొన్నారు. కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఇవాళ మృతి చెందగా, మృతదేహాన్ని మళ్లీ డోలీలోనే స్వగ్రామానికి తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తప్పని డోలి మోత కష్టాలు..!


