NTR: నందిగామ పట్టణంలోని పంచాయతీరాజ్ ఉప కార్యనిర్వాహణ ఇంజనీరింగ్ కార్యాలయ ప్రాంగణం రాత్రివేళ ఆకతాయి యువతకు అడ్డాగా మారింది. కొంతకాలంగా యువకులు ఇక్కడ మద్యం సేవిస్తూ, మహిళలు, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో రాత్రివేళ ఈ మార్గంలో వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఆకతాయిలపై పోలీసులు నిఘా పెట్టిలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నందిగామలో ఆకతాయిల హల్‌చల్


