హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంబులెన్స్‌లోనే గర్భిణి ప్రసవం..!

GNTR: వైకుంఠపురం గ్రామానికి చెందిన తిరుపతమ్మకు ప్రసవ నొప్పులు రావడంతో బుధవారం కుటుంబసభ్యులు తుళ్లూరు అంబులెన్స్‌లో ఆసుపత్రికి బయలుదేరారు. మార్గమధ్యంలోనే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈఎంటీ సన్నీ, పైలెట్ శివయ్యల సహాయంతో ప్రసవం సురక్షితంగా జరిగిందని, ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వారు వెల్లడించారు.